ఇంకేముంది మరో రొజో గంటో అంతే కేసీఆర్ మనకు దక్కడని ఆఘమేఘాల మీద కేంద్రం తెలంగాణ నిర్ణయం తెసుకుంది. నిర్ణయం తెసుకున్న 24గంటలలోనే కేసీఆర్ లేచి ఇంటికి బయలుదేరడంతో గత 11 రోజులుగా చేపట్టిన దీక్ష నిజమేనా అనే అనుమానం ఏ ఒక్క పూట ఉపవాసం వున్న వారికైనా కలుగకమానదు.
కేవలం పదిరోజులు నిరాహార దీక్ష చేస్తే ప్రత్యేక రాష్ట్రం ఇచ్చేస్తారా? అని ప్రజారాజ్యం శాసనసభ్యులు బండారు సత్యానందం, వంగా గీత, కన్నబాబు, యలమంచిలి రవి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అర్ధరాత్రి ప్రత్యేక తెలంగాణ ప్రకటించి ఇతర ప్రాంతాల మనోభావాల్ని తీవ్రంగా గాయపరిచారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు.
No comments:
Post a Comment